రాజస్థాన్‌లోని మూడు మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ స్థానాలు కైవసం చేసుకున్న బీజేపీ
రిపోర్టర్: సురేష్
స్థలం: Rajasthan
రాజస్థాన్‌లోని మూడు నగరాల మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ స్థానాలను కమల దళం కైవసం చేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. జోధ్‌పూర్ మేయర్‌గా ప్రసన్న చంద్ మెహతా, జైపూర్‌గా సునీల్ కొఠారి, కోట మేయర్‌గా అనసూయ గోస్వామి ఎన్నికైనట్లు తెలిపారు. శుక్రవారం జరిగిన ఈ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులు ఘన విజయం సాధించారు. కోటలో కాంగ్రెస్ అభ్యర్థులు క్రాస్ ఓటింగ్‌కు పాల్పడటం గమనార్హం. ఈ విజయంతో ఆయా ప్రాంతాల్లో బీజేపీ శ్రేణులు సంబరాలు జరుపుకున్నాయి.