పాలకొండ ఎన్నికల్లో జనసేన జైత్రయాత్రతో వైసీపీ చిత్తుగా ఓడింది

రిపోర్టర్: Alfa News Desk స్థలం: పాలకొండ

పాలకొండ నగర పంచాయతీ ఎన్నికల ఫలితాల్లో జనసేన పార్టీ విజయదుందుభి మోగించింది. నియోజకవర్గంలో జరిగిన ఈ ఎన్నికల్లో జనసేన అభ్యర్థులు అత్యధిక వార్డులను కైవసం చేసుకుని అగ్రస్థానంలో నిలిచారు. మొత్తం ఫలితాలను పరిశీలిస్తే జనసేన పన్నెండు స్థానాల్లో గెలుపొందగా, తెలుగుదేశం పార్టీ పది స్థానాలను కైవసం చేసుకుంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాలుగు స్థానాలకు పరిమితం కాగా, బీజేపీ మరియు స్వతంత్ర అభ్యర్థి ఒక్కో స్థానాన్ని గెలుచుకున్నారు.