మెగా డీఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణ జరపాలి: వైఎస్ జగన్
రిపోర్టర్: వెంకట్
స్థలం: ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్ మెగా డీఎస్సీ నియామకాల్లో భారీ అక్రమాలు జరిగాయని మాజీ సీఎం వైఎస్ జగన్ ఆరోపించారు. కర్నూలులో అనర్హులకు పోస్టింగ్ ఇవ్వడం వెనుక లోకేష్ హస్తం ఉందని విమర్శించారు. అటవీశాఖ నియామకాల్లోనూ అవకతవకలు జరిగాయని, ఈ మొత్తం వ్యవహారంపై సీబీఐ విచారణ జరపాలని డిమాండ్ చేశారు. బాధితుల తరఫున కోర్టుల్లో పోరాటం చేస్తామని, పారదర్శకత లేని విచారణలను నమ్మబోమని జగన్ స్పష్టం చేశారు.