రోడ్డు ప్రమాద బాధితులకు సాయం చేయండి: ఏలూరు జిల్లా పోలీసుల పిలుపు

రిపోర్టర్: రాజేష్ స్థలం: ఏలూరు

రోడ్డు ప్రమాదాల సమయంలో క్షతగాత్రులకు వెంటనే సాయం అందించాలని ఏలూరు జిల్లా పోలీసులు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఆపదలో ఉన్నవారిని ఆదుకోవడం ద్వారా విలువైన ప్రాణాలను కాపాడవచ్చని సూచించారు. ప్రమాద బాధితులకు సహాయం చేసే వారికి ప్రభుత్వ నిబంధనల ప్రకారం ప్రత్యేక రివార్డులతో పాటు పూర్తి చట్టపరమైన రక్షణ ఉంటుందని ఏలూరు పోలీస్ యంత్రాంగం స్పష్టం చేసింది. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా రోడ్డు భద్రతపై అవగాహన కల్పిస్తూ వారు సందేశం విడుదల చేశారు.