వైవిధ్యమైన పాత్రలతో అలరించేందుకు వస్తున్న జార్జ్ క్రిష్ మూవీ

రిపోర్టర్: మహేష్ స్థలం: హైదరాబాద్

టాలీవుడ్ చార్మింగ్ స్టార్ శర్వానంద్ హీరోగా, శ్రీను వైట్ల దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘జార్జ్ క్రిష్’. ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ బూస్టర్‌ను దర్శకుని పుట్టినరోజు సందర్భంగా మేకర్స్ విడుదల చేశారు. ఇందులో శర్వానంద్ క్రిస్టియన్‌గా జార్జ్, హిందువుగా క్రిష్ అనే రెండు విభిన్న పాత్రల్లో నటిస్తున్నారు. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్న ఈ భారీ వినోదాత్మక కుటుంబాన్ని అలరించే చిత్రాన్ని 2027 జనవరి 14న సంక్రాంతి కానుకగా ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల చేయనున్నారు.