'తప్పుడు ఆరోపణలు చేసినందుకు క్షమాపణ చెప్పు': కేసీఆర్ ఫైర్
రిపోర్టర్: సతీష్
స్థలం: తెలంగాణ
కేసీఆర్ పై తప్పుడు ఆరోపణలు చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెంటనే క్షమాపణ చెప్పాలని కె. చంద్రశేఖర్ రావు (KCR డిమాండ్ చేశారు. అసెంబ్లీ సాక్షిగా కేసీఆర్ కు కేవలం అరవై ఏడు ఎకరాలు మాత్రమే ఉన్నట్లు రేవంత్ ఒప్పుకున్నారని గుర్తుచేశారు. వెయ్యి ఎకరాలంటూ నిరాధార ఆరోపణలు చేసి ప్రజలను మోసగించారని మండిపడ్డారు. కేసీఆర్ ఎప్పుడూ భూదందాలు చేయలేదని, రేవంత్ రెడ్డి లాంటి చిల్లర మాటలు మాట్లాడేవారికి తగిన బుద్ధి చెబుతామని కె. చంద్రశేఖర్ రావు (KCR హెచ్చరించారు.