ఏపీలో ఎస్ఐ, కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

రిపోర్టర్: గోపి స్థలం: ఆంధ్రప్రదేశ్

ఆంధ్రప్రదేశ్ లో నిరుద్యోగ యువతకు ప్రభుత్వం శుభవార్త తెలిపింది. రాష్ట్ర స్థాయి పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు ఎస్ఐ, కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 378 ఎస్ఐ పోస్టులు మరియు 1156 కానిస్టేబుల్ పోస్టులను భర్తీ చేయనున్నారు. సుదీర్ఘకాలంగా ఎదురుచూస్తున్న అభ్యర్థులు త్వరలో ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని అధికారులు వెల్లడించారు.