అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేయాలంటూ ముప్పాళ్ల నాగేశ్వరరావు తీవ్ర డిమాండ్
రిపోర్టర్: నరేష్
స్థలం: హైదరాబాద్
రాష్ట్రంలో అగ్రిగోల్డ్ బాధితుల బాండ్ల పరిశీలన కోసం పది కేంద్రాలను ఏర్పాటు చేయాలని అగ్రిగోల్డ్ బాధితుల సంఘం జాతీయ నాయకుడు ముప్పాళ్ల నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. హైదరాబాద్‌లోని మఖ్దూంభవన్‌లో తెలంగాణ అగ్రిగోల్డ్ బాధితుల సంఘం అధ్యక్షురాలు పశ్య పద్మ అధ్యక్షతన మంగళవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. విజయవాడ కేంద్రంగా ప్రత్యేక కోర్టును వెంటనే అమల్లోకి తీసుకొచ్చి బాధితులకు తక్షణమే న్యాయం చేయాలని ఆయన తెలంగాణ ప్రభుత్వాన్ని కోరారు.