హైదరాబాద్ టెక్ ప్రస్థానంపై చంద్రబాబు ఆసక్తికర జ్ఞాపకాలు

రిపోర్టర్: రాజేష్ స్థలం: హైదరాబాద్

మైక్రోసాఫ్ట్ సంస్థ హైదరాబాద్లో తన తొలి డెవలప్మెంట్ సెంటర్ను ఏర్పాటు చేయడంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలక జ్ఞాపకాలను పంచుకున్నారు. 1997లో బిల్ గేట్స్కు తాను ఇచ్చిన ప్రెజెంటేషనే నగర రూపురేఖలను పూర్తిగా మార్చివేసిందని ఆయన వెల్లడించారు. విధాన స్థిరత్వం, పట్టుదలతో కూడిన దార్శనికతతోనే పెనుమార్పులు సాధ్యమవుతాయని, ఆనాడు నాటి సమావేశంతోనే హైదరాబాద్ ప్రపంచ ఐటీ మ్యాప్లో నిలిచిందని చంద్రబాబు సోషల్ మీడియా వేదికగా స్పష్టం చేశారు.