క్రికెటర్ శ్రీశాంత్ ఇంట విషాదం.. తండ్రి కన్నుమూత

రిపోర్టర్: సురేష్ స్థలం: కేరళ

భారత మాజీ పేసర్ శ్రీశాంత్ ఇంట్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఆయన తండ్రి వి. సంతకుమారన్ నాయర్ కొచ్చిలోని తన నివాసంలో శుక్రవారం తుదిశ్వాస విడిచారు. కొడుకు క్రికెట్ ప్రస్థానంలో ఎంతగానో ప్రోత్సహించిన ఆయన మృతి పట్ల పలువురు మాజీ క్రికెటర్లు, ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. శ్రీశాంత్ కుటుంబానికి తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ తీవ్ర సంతాపం ప్రకటించారు.