తిరుమలలో తొలిసారిగా నటి డింపుల్ హయతి ప్రత్యేక నృత్య ప్రదర్శన

రిపోర్టర్: రాజేష్ స్థలం: తిరుమల

తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల వేళ తిరుమల చరిత్రలోనే తొలిసారిగా ప్రముఖ టాలీవుడ్ నటి డింపుల్ హయతి శ్రీవారి సన్నిధిలో భక్తిభావంతో ప్రత్యేక నృత్య ప్రదర్శన ఇచ్చారు. స్వామివారి సేవలో భాగంగా ఆమె ఈ నృత్య అంజలి ఘటించడం పట్ల భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తిరుమల వేదికగా ఓ ప్రముఖ నటి ఈ రీతిలో నాట్యసేవ చేయడం ఇదే తొలిసారి కావడంతో ఈ వార్త ప్రస్తుతం ప్రాధాన్యత సంతరించుకుంది.