అంగన్వాడీ పిల్లల్లో మందగించిన అభివృద్ధి, 87 వేలకు పైగా తీవ్ర లోపాలు
రిపోర్టర్: వెంకట్
స్థలం: ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా అంగన్వాడీ కేంద్రాల్లో నిర్వహించిన నవచేతన స్క్రీనింగ్‌లో చిన్నారుల వయసుకు తగ్గ అభివృద్ధి మందగించినట్లు తేలింది. 18 లక్షలకు పైగా పిల్లలకు పరీక్షలు నిర్వహించగా, 87,448 మందిలో తీవ్రమైన లోపాలు ఉన్నట్లు గుర్తించారు. కర్నూలు జిల్లాలో అత్యధికంగా ఈ సమస్య ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ ప్రత్యేక స్క్రీనింగ్ ద్వారా గుర్తించిన పిల్లలకు వైద్య నిపుణుల పర్యవేక్షణలో మెరుగైన చికిత్స అందిస్తున్నారు.