రైలు ప్రయాణంలో చేదు అనుభవం ఎదురైందన్న గాయని శివశ్రీ స్కందప్రసాద్
రిపోర్టర్: శివ
స్థలం: బెంగళూరు
ప్రముఖ కర్ణాటక సంగీత గాయని, బెంగళూరు సౌత్ బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య సతీమణి శివశ్రీ స్కందప్రసాద్ రైలు ప్రయాణంలో తీవ్ర చేదు అనుభవం ఎదురైందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎక్స్ వేదికగా ఆమె స్పందిస్తూ, ఐదు గంటల ప్రయాణంలో నలుగురు ప్రయాణికులు కోచ్‌లో పెద్దపెద్దగా అరుస్తూ, నవ్వుతూ ఇబ్బంది పెట్టారని తెలిపారు. పబ్లిక్ స్థలాల్లో కనీస పౌర స్పృహ, ఇతరుల వ్యక్తిగత స్థలాన్ని గౌరవించడం లేదని ఆమె తీవ్రంగా మండిపడ్డారు.