రేవంత్ సర్కార్ కోతల మోసంపై కేటీఆర్ ఫైర్

రిపోర్టర్: సునీల్ స్థలం: వనపర్తి

ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇస్తున్నామంటూ రేవంత్ రెడ్డి ప్రభుత్వం పచ్చి అబద్ధాలు చెబుతోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. వనపర్తి జిల్లా పెబ్బేరు మండలం గుమ్మడం సబ్‌స్టేషన్‌ను రైతులతో కలిసి ఆయన సందర్శించారు. సబ్‌స్టేషన్ లాగ్‌బుక్‌ను పరిశీలించి విద్యుత్ సరఫరా తీరుపై ఆరా తీశారు. కోతల సర్కార్ మోసాలను రైతుల సమక్షంలో ఎండగట్టారు.