జగన్నాధపురంలో ఓట్ల వేటలో దూకుడు పెంచిన కూటమి అభ్యర్థులు
రిపోర్టర్: Y.V.RAMANA
స్థలం: ఐనవిల్లి
అయినవిల్లి మండలంలోని కె.జగన్నాధపురం గ్రామంలో కూటమి అభ్యర్థులు ఘనంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. జడ్పీటీసీ అభ్యర్థి మద్దాల శివరామ మంగాదేవి రాజా, ఎంపీటీసీ అభ్యర్థి మోర్త వరలక్ష్మి సత్తిబాబు భారీ ర్యాలీ చేపట్టి ఓటర్లను అభ్యర్థించారు. ఈ సందర్భంగా అభివృద్ధి, సంక్షేమాన్ని కాంక్షించి తమకు ఓటు వేయాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.