రిషబ్ పంత్ ఆవేదన: జట్టులో చోటు దక్కకపోతే బాధగా ఉంటుందని వెల్లడి

రిపోర్టర్: రాము స్థలం: న్యూఢిల్లీ

భారత వన్డే జట్టులో తనకు చోటు దక్కకపోవడంపై ప్రముఖ క్రికెటర్ రిషబ్ పంత్ ఆవేదన వ్యక్తం చేశారు. జట్టు నుంచి తప్పించినప్పుడు ఎవరికైనా బాధ కలుగుతుందని, అయితే అథ్లెట్ జీవితంలో ఇలాంటి కష్టాలు సహజమని ఆయన పేర్కొన్నారు. ఓ పాడ్కాస్ట్ ఇంటర్వ్యూలో మాట్లాడిన పంత్, ఎదురుదెబ్బల నుంచి కోలుకుని తిరిగి బలమైన పునరాగమనం సాధిస్తామని స్పష్టం చేశారు. కఠిన శ్రమతో తన లక్ష్యం వైపే అడుగులు వేస్తున్నట్లు ఆయన వెల్లడించారు.