ది ప్యారడైజ్ ఫస్ట్ హాఫ్ చూసిన నాని మరియు అనిరుధ్
రిపోర్టర్: వెంకట్
స్థలం: చెన్నై
నేచురల్ స్టార్ నాని, డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్లో వస్తున్న ది ప్యారడైజ్ సినిమాపై అంచనాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. చెన్నైలో జరుగుతున్న ఈ సినిమా రీరికార్డింగ్ వర్క్స్ క్లైమాక్స్ దశకు చేరుకున్నాయి. చెన్నై ప్రెస్‌మీట్ అనంతరం నాని, శ్రీకాంత్ ఓదెలతో కలిసి అనిరుధ్ రవిచందర్ స్టూడియోకు వెళ్లి సినిమా ఫస్ట్ హాఫ్‌ను వీక్షించారు. ఫస్ట్ హాఫ్ అవుట్‌పుట్ చూసి ముగ్గురూ సంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. ముఖ్యంగా నాని ఇంటెన్స్ పెర్ఫార్మెన్స్కు అనిరుధ్ అందిస్తున్న బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాకు మరింత హైలైట్‌గా నిలవనుందని చిత్ర వర్గాలు చెబుతున్నాయి.