ఫామ్‌హౌస్‌లో పుట్టినరోజు వేడుకలు: బీటెక్ విద్యార్థి అనుమానాస్పద మృతితో కలకలం
రిపోర్టర్: వెంకట్
స్థలం: ఘట్కేసర్
ఘట్కేసర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఫామ్‌హౌస్‌లో జరిగిన స్నేహితుడి పుట్టినరోజు వేడుకలకు వెళ్లిన బీటెక్ విద్యార్థి కృష్ణ కౌండిన్య అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం తీవ్ర కలకలం రేపిందిని పోలీసులు తెలిపారు. ఉప్పల్ భగాయత్ ప్రాంతానికి చెందిన కృష్ణ కౌండిన్య ఈ నెల ఇరవై నాలుగో తేదీ సాయంత్రం ఏదులాబాద్‌లోని లివిన్ ఫామ్‌హౌస్‌కు వెళ్లాడని, ఆదివారం ఉదయం ఆయన అపస్మారక స్థితిలో ఉన్నట్లు స్నేహితులు తండ్రికి ఫోన్ చేసి సమాచారం అందించారని కుటుంబ సభ్యులు వాపోయారు.