విద్యార్థుల బాల్యాన్ని చంపకండి: ఉపాధ్యాయులకు ప్రధాని మోదీ కీలక పిలుపు
రిపోర్టర్: రమేష్
స్థలం: India
ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా జాతీయ అవార్డు గ్రహీతలతో ప్రధాని మోదీ భేటీ అయ్యారు. విద్యార్థులపై పెరుగుతున్న ఒత్తిడి, డ్రగ్స్ అలవాట్లు, స్క్రీన్ టైమ్ పట్ల ఉపాధ్యాయులు అప్రమత్తంగా ఉండాలని ఆయన కోరారు. కేవలం మార్కులకే పరిమితం కాకుండా, పిల్లల ప్రవర్తనను గమనిస్తూ వారి బాల్యాన్ని కాపాడాలని, క్రీడలు, సృజనాత్మక పనుల వైపు వారిని ప్రోత్సహించాలని మోదీ ఉద్ఘాటించారు. 'పిల్లల బాల్యాన్ని చనిపోనివ్వకండి' అని ఆయన ఉపాధ్యాయులకు స్పష్టమైన సందేశాన్ని ఇచ్చారు.