వీధుల వెంట బెదిరిస్తున్న కుక్కల కోతుల కాటు

రిపోర్టర్: KOLA MAHESH స్థలం: నారాయణపురం

యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండలంలోని కొత్తగూడెం గ్రామపంచాయతీలో వీధి కుక్కలు, కోతుల బెడదతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఈ సమస్యపై గ్రామానికి చెందిన యువత శుక్రవారం స్థానిక ఎంపీడీవో ప్రమోద్ కుమార్కు వినతిపత్రం అందజేశారు. గతంలో కుక్క కరిచినా అధికారులు స్పందించలేదని ఆవేదన వ్యక్తం చేస్తూ వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.