మైనార్టీలకిచ్చిన హామీలను గాలికొదిలేసిన కాంగ్రెస్ సర్కార్పై పోరుబాటకు తంజీమ్ పిలుపు

రిపోర్టర్: ఆముదాల వెంకన్న స్థలం: ఖమ్మం అర్బన్

ఎన్నికల్లో ముస్లిం మైనార్టీలకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చాలని తంజీమ్-ఎ-ఇన్సాఫ్ రాష్ట్ర ప్రచార కార్యదర్శి మొహమ్మద్ సలాం డిమాండ్ చేశారు. బైపాస్ రోడ్డులో నిజాంపేట్ యాఖూబ్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. సంక్షేమ పథకాలకు నిధులు విడుదల చేయకుండా ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం చేస్తోందని విమర్శించారు. హక్కుల సాధన కోసం రాజీలేని పోరాటం చేస్తామని ఈ సమావేశంలో స్పష్టమైన నిర్ణయం తీసుకున్నారు.