రెస్క్యూ ఆపరేషన్‌లో అటవీ శాఖ అధికారికే చుక్కలు చూపించిన చిరుత

రిపోర్టర్: గోపి స్థలం: కర్ణాటక

కర్ణాటకలోని దಾವಣగెరె జిల్లాలో జాతీయ రహదారిపై ప్రమాదానికి గురైన చిరుతను రక్షించేందుకు వెళ్లిన అటవీ సిబ్బందిపై ఆ ప్రాణి ఒక్కసారిగా దాడి చేసింది. హైవేపై కారు ఢీకొనడంతో గాయపడిన చిరుతకు మత్తుమందు ఇచ్చినప్పటికీ, అది పూర్తిగా స్పృహ కోల్పోకముందే సిబ్బందిపైకి దూసుకెళ్లింది. తోటి సిబ్బంది వెంటనే అప్రమత్తమై కర్రలతో చిరుతను పక్కకు త్రిప్పి బాధితుడిని రక్షించారు. చివరకు ఆ చిరుతను సురక్షితంగా బంధించి చికిత్స నిమిత్తం తరలించారు.