ఫిలిప్పీన్స్‌లో ఘోర పడవ ప్రమాదం.. ఐదుగురు మృతి, 87 మంది గల్లంతు

రిపోర్టర్: ప్రసాద్ స్థలం: World

ఫిలిప్పీన్స్‌లోని పలవాన్ ప్రావిన్స్‌లో ప్రయాణికులతో వెళ్తున్న పడవలో భారీ మంటలు చెలరేగి ప్రమాదం సంభవించింది. ఈ దుర్ఘటనలో ఐదుగురు మృతి చెందగా, 87 మంది గల్లంతయ్యారు. మరో 42 మందిని రక్షించి ఆసుపత్రికి తరలించారు. పడవలో మొత్తం 137 మంది ప్రయాణికులు, సిబ్బంది ఉన్నారు. బలమైన అలలు, సముద్ర ప్రవాహాల నడుమ కోస్ట్ గార్డ్ సిబ్బంది గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు.