వలస నేతలకు మొహం మీదే తలుపులు వేసిన కూటమి

రిపోర్టర్: సిటిజెన్ పోస్ట్ స్థలం: పాలకొండ

పాలకొండలో మొన్నటి స్థానిక ఎన్నికల్లో విజయం సాధించిన అభ్యర్థులు అధికార పార్టీలో చేరేందుకు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే పార్టీ ఫిరాయింపులకు తెరలేపగా, కూటమికి చెందిన కీలక నేతలు వాటిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అభ్యర్థుల గోడదూకుడుకు అడ్డుకట్ట వేస్తూ, ఫిరాయింపులను ప్రోత్సహించబోమని వారు కరాఖండీగా స్పష్టం చేశారు. దీంతో స్థానిక రాజకీయాల్లో ఈ పరిణామం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.