నీటిని వృథా చేయకుండా పొదుపుగా వాడాలంటూ జహీరాబాద్ కౌన్సిలర్ పిలుపు
రిపోర్టర్: Alfa News Desk
స్థలం: జహీరాబాద్
జహీరాబాద్ అల్లీపూర్ వార్డు ప్రజలు నీటిని వృథా చేయకుండా పొదుపుగా వినియోగించాలని అల్లీపూర్ వార్డు కౌన్సిలర్ విజయరాజు సూచించారు. ప్రతి నీటి చుక్క విలువైనదని, నీటి సంరక్షణ అందరి బాధ్యత అని ఆయన పేర్కొన్నారు. భవిష్యత్తులో నీటి కొరత తలెత్తకుండా ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఈ సందర్భంగా ప్రత్యేకంగా పిలుపునిచ్చారు.