అమెరికా షరతులు అంగీకరిస్తేనే హర్మూజ్ జలసంధి తెరుస్తామన్న ఇరాన్

రిపోర్టర్: సతీష్ స్థలం: పశ్చిమాసియా

అమెరికా-ఇరాన్ మధ్య సైనిక, దౌత్యపరమైన వివాదాలు పశ్చిమాసియాలో తీవ్ర ఆందోళన రేకెత్తిస్తున్నాయి. ఇరాన్ నిర్దేశించిన షరతులను అమెరికా అంగీకరించి, తన హామీలను నెరవేర్చే వరకు వ్యూహాత్మక హర్మూజ్ జలసంధిని తెరిచేది లేదని ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మహమ్మద్ బాగేర్ గాలిబఫ్ స్పష్టం చేశారు. ఇరాన్‌పై అమెరికా మళ్లీ సైనిక దాడికి తెగబడితే పశ్చిమాసియాలోని అమెరికా మిలిటరీ స్థావరాలపై తీవ్రమైన దాడులు నిర్వహిస్తామని ఇరాన్ సైనిక రక్షణ విభాగం హెచ్చరించింది.