బంగ్లాదేశీగా భావించి అరెస్ట్ చేసిన వృద్ధుడికి కోర్టు బెయిల్ మంజూరు

రిపోర్టర్: సతీష్ స్థలం: పశ్చిమ బెంగాల్

బంగ్లాదేశీయుడిగా భావించి మూడు నెలలుగా నిర్బంధంలో ఉంచిన డెబ్బై ఏళ్ల జలీల్ అక్తర్‌కు ఇస్లాంపూర్ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఆయన భారతీయ పౌరుడని నిరూపించే తొమ్మిది పత్రాలను న్యాయస్థానంలో సమర్పించారు. ఓటరు జాబితాలు, ఆధార్ కార్డులను పరిశీలించిన మేజిస్ట్రేట్ ఆయనకు పది వేల రూపాయల పూచీకత్తుపై బెయిల్ ఇస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.