బాసర ట్రిపుల్ ఐటీలో నీటి కొరట: సెలవులు పొడిగింపుపై అధికారుల ప్రకటన
రిపోర్టర్: నరేష్
స్థలం: నిర్మల్
నిర్మల్ జిల్లా బాసర ట్రిపుల్ ఐటీలో తీవ్ర నీటి కొరత ఏర్పడిందని, అధికారుల నిర్లక్ష్యమే దీనికి కారణమని వైస్ ఛాన్సలర్ వెల్లడించారు. గోదావరి జలాల సరఫరాలో మోటర్లు పాడవడంతో విద్యార్థుల తాగునీటి అవసరాలు దెబ్బతిన్నాయి. దీంతో దసరా సెలవులను ఆదివారం వరకు పొడిగిస్తూ ఆన్లైన్ తరగతులు నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు. తొమ్మిది వేల మంది విద్యార్థులు ఇళ్లబాట పట్టారు.