స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ నిలిపివేత

రిపోర్టర్: శివ స్థలం: కామారెడ్డి

కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతల మధ్య వివాదం కారణంగా నాగిరెడ్డిపేట్ మండలం ధర్మారెడ్డి గ్రామంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ నిలిచిపోయింది. పంపిణీ విషయంలో ఇరువర్గాల మధ్య వాగ్వాదం చోటుచేసుకోవడంతో తహసీల్దార్ ప్రక్రియను ఆపేశారు. దీంతో సర్పంచ్ లక్ష్మి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ నేతలు తహసీల్దార్ కార్యాలయం ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు. కాంగ్రెస్ కార్యకర్తలు అనధికారికంగా పంపిణీ చేయాలని చూస్తున్నారని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు.