నాయకుల మోసంతో కోటి రూపాయలు నష్టపోయానంటూ వైకాపా నేత ఆవేదన

రిపోర్టర్: రమేష్ స్థలం: అమలాపురం

రామచంద్రపురం మున్సిపాలిటీ వైకాపా ఛైర్మన్ అభ్యర్థి చింతపల్లి నాగేశ్వరరావు తన ఓటమిపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. మాజీ ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్, ఆయన కుమారుడు సూర్యప్రకాశ్ రావు కారణంగానే తాను ఓడిపోయానని ఆయన ఆరోపించారు. వారిని నమ్మి కోటి రూపాయల వరకు పాడుచేసుకున్నానని, ప్రచారానికి కూడా రాలేదని వాపోయారు. స్థానిక నేతల తీరుపై మండిపడుతూ సామాజిక మాధ్యమాలలో కన్నీటిపర్యంతమయ్యారు.