అన్నదాతల ఆక్రోశం: పంట నష్టపోయిన రైతులను తక్షణమే ఆదుకోవాలని డిమాండ్

రిపోర్టర్: రమేష్ స్థలం: నల్గొండ

వర్షాకాలంలో పంటలు ఎండిపోయి తీవ్రంగా నష్టపోయిన రైతులను ఆదుకోవాలని సీపీఐ జాతీయ కార్యదర్శి పల్లా వెంకట్ రెడ్డి డిమాండ్ చేశారు. నాంపల్లి మండలం నరసింహులగూడెం గ్రామంలో కరువు యాత్రలో భాగంగా ఎండిన పంటలను పరిశీలించి రైతులతో మాట్లాడినట్లు ఆయన తెలిపారు. వరి పంటకు ఎకరాకు ముప్ పై వేలు, పత్తికి యాభై వేల చొప్పున నష్టపరిహారం చెల్లించాలని, కేంద్ర ప్రభుత్వం తెలంగాణను కరువు రాష్ట్రంగా గుర్తించి ముప్ పై వేల కోట్ల నిధులు కేటాయించాలని ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం కోరారు.