యూపీ హోంగార్డ్ పీఈటీ పరీక్ష వాయిదా
రిపోర్టర్: భాస్కర్
స్థలం: ఉత్తరప్రదేశ్
ఉత్తరప్రదేశ్‌లో భారీ వర్షాల కారణంగా హోంగార్డ్ నియామక దేహదారుణ్య పరీక్ష వాయిదా పడింది. సెప్టెంబర్ 8న జరగాల్సిన పీఈటీ పరీక్షలను సెప్టెంబర్ 14కి మారుస్తూ యూపీ పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు నిర్ణయం తీసుకుంది. సెప్టెంబర్ 10న కొత్త హాల్ టికెట్లు విడుదల చేయనున్నారు. పాత హాల్ టికెట్లు చెల్లవని బోర్డు స్పష్టం చేసింది.