గుంజపడుగు పాఠశాలలో విద్యార్థులకు ఉచితంగా యూనిఫాంల పంపిణీ
రిపోర్టర్: Subhan.Manthani
స్థలం: మంథని
మంథని మండలం గుంజపడుగు పాఠశాలలో విద్యార్థులకు సోమవారం సర్పంచ్ దండవేన సంధ్య బానేష్ యూనిఫాంలు పంపిణీ చేశారు. ప్రభుత్వం విద్యార్థులకు ఉచితంగా యూనిఫాంలు అందజేస్తోందని, స్థానిక మహిళలకు ఉపాధి కల్పించేలా వీటిని కుట్టించడం అభినందనీయమని సర్పంచ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, డ్వాక్రా మహిళలు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.