సమాజంలో శాంతిభద్రతల పరిరక్షణే పోలీసుల ప్రధాన కర్తవ్యం

రిపోర్టర్: వెంకట్ స్థలం: కర్నూలు

సమాజంలో పోలీసుల పాత్ర కీలకమని రాష్ట్ర మంత్రి టీజీ భరత్ స్పష్టం చేశారు. కర్నూలులోని ఏపీఎస్పీ రెండవ బెటాలియన్లో నిర్వహించిన పాసింగ్ అవుట్ పరేడ్ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. తొమ్మిది నెలల పాటు కఠిన శిక్షణ పూర్తి చేసుకున్న 629 మంది ప్రత్యేక పోలీసుల కవాతు ప్రదర్శనను తిలకించి గౌరవ వందనం స్వీకరించారు. నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుని బాధ్యతాయుతమైన ప్రజారక్షకులుగా సేవలందించాలని నూతన పోలీసులను మంత్రి పిలుపునిచ్చారు.