వైద్య విద్యార్థులకు అలర్ట్: ఏఐఏపీజీఈటీ కౌన్సిలింగ్ షెడ్యూల్ విడుదల చేసిన కమిటీ
రిపోర్టర్: సతీష్
స్థలం: New Delhi
ఆల్ ఇండియా ఆయుష్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఎంట్రన్స్ టెస్ట్ కౌన్సిలింగ్ షెడ్యూల్ను ఆయుష్ అడ్మిషన్స్ సెంట్రల్ కౌన్సిలింగ్ కమిటీ విడుదల చేసినట్లు అధికారులు ప్రకటించారు. ఈ విద్యా సంవత్సరానికి సంబంధించి మొదటి విడత రిజిస్ట్రేషన్ ప్రక్రియ అక్టోబర్ ఇరవై ఆరు నుంచి నవంబర్ ఒకటి వరకు కొనసాగుతుందని పేర్కొన్నారు. అర్హులైన అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.