సిఎం రాచపల్లిలో ఇంటింటి ప్రచారంతో హోరెత్తించిన వైఎస్సార్సీపీ అభ్యర్థి బాలాజీ
రిపోర్టర్: Alfa News Desk
స్థలం: చిట్వేల్
తిరుపతి జిల్లా చిట్వేల్ మండలంలోని సిఎం రాచపల్లిలో వైఎస్సార్సీపీ ఎంపీటీసీ అభ్యర్థి శ్రీకుల బాలాజీ ఎన్నికల ప్రచారాన్ని ఘనంగా ప్రారంభించారు. స్థానిక వినాయక ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ఇంటింటి ప్రచారం చేపట్టారు. గ్రామ అభివృద్ధికి కృషి చేస్తానని, భారీ మెజారిటీతో గెలిపించాలని ఆయన ఓటర్లను కోరారు. ఈ కార్యక్రమంలో పలువురు పార్టీ నాయకులు మరియు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని మద్దతు తెలిపారు.