స్థానిక ఎన్నికల సన్నద్ధతపై కూటమి నేతలతో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సమావేశం

రిపోర్టర్: సునీల్ స్థలం: ఆంధ్రప్రదేశ్

రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల మధ్య సమన్వయం మరియు భవిష్యత్ కార్యాచరణపై టీడీపీ, జనసేన నేతలతో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు మాధవ్, మంత్రి సత్యకుమార్ చర్చించినట్లు బీజేపీ ఆంధ్రప్రదేశ్ శాఖ వెల్లడించింది. ఎన్నికల సన్నద్ధతపై ఇరు పార్టీల నేతలతో కీలక భేటీ నిర్వహించినట్లు పేర్కొంది.