కాకినాడలో ముంపు ముసలం: కాలువల ఆక్రమణలపై సర్కార్ కొరడా

రిపోర్టర్: ప్రసాద్ స్థలం: కాకినాడ

కాకినాడ నగరంలో కాలువల ఆక్రమణల కారణంగా వర్షపు నీరు నిలిచిపోతు స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అధికారులు తెలిపారు. నగరంతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో వందల ఎకరాల సాగునీటి వనరులు కబ్జాకు గురయ్యాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వం హయాంలోనే కాలువలు ఆక్రమణలకు గురయ్యాయనే ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో, కూటమి ప్రభుత్వం స్పందించి ఆక్రమణదారులకు నోటీసులు జారీ చేసి తక్షణ చర్యలు చేపట్టాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.