విజయవాడలో స్పోర్ట్స్ కోటా టీచర్లపై దాడి చేయడం దుర్మార్గం అంటూ మంత్రి నారా లోకేశ్ ఆగ్రహం

రిపోర్టర్: సురేష్ స్థలం: విజయవాడ

విజయవాడలోని శాప్ కార్యాలయం వద్ద స్పోర్ట్స్ కోటా డీఎస్సీ-2025 ద్వారా ఉపాధ్యాయ ఉద్యోగాలు సాధించిన వారిపై వైసీపీ మూకలు దాడికి పాల్పడటం పట్ల రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. క్రీడాకారులకు అన్యాయం చేయడం, గురువులపై రాడ్లు మరియు కర్రలతో దాడులకు పాల్పడటం అత్యంత దుర్మార్గమని ఆయన మండిపడ్డారు. ఈ ఘటనపై స్పందిస్తూ టీచర్లపై దాడికి పాల్పడిన వారిని వదిలిపెట్టేది లేదని, చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.