ఆమనగల్లులో ఘనంగా శక్తి యూత్ గణేష్ ఆగమనం
రిపోర్టర్: Abdul Azeem
స్థలం: ఆమనగల్
ఆమనగల్లులో శక్తి యూత్ ఆధ్వర్యంలో గణేష్ విగ్రహ ప్రతిష్టాపన వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో ముఖ్య నాయకులు భీమనపల్లి దుర్గయ్య, మారేపల్లి వెంకటేష్ గౌడ్, ముకురాల శివ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
స్థానిక కాలనీ వాసుల సమక్షంలో గణేష్ విగ్రహాన్ని అత్యంత భక్తిశ్రద్ధలతో ఊరేగింపుగా తీసుకువచ్చారు. ఈ కార్యక్రమంలో భీమనపల్లి పవన్, శివ గౌడ్, కుమార్, మహేష్, దేవారాజు, రవి, ప్రసాద్, మున్నా, అరుణ్, అనిల్, శ్రీకాంత్, సురేష్ తదితరులు ఉత్సాహంగా పాల్గొన్నారు.