నామినేషన్ ఉపసంహరణ వివాదం: సొంత పార్టీ నేతలపై వైకాపా అభ్యర్థి సంచలన ఆరోపణలు
రిపోర్టర్: విజయ్
స్థలం: ఏలూరు
ఆర్థిక కారణాలతో పోటీ నుంచి తప్పుకోవాలనుకున్న తనను సొంత పార్టీ నేతలే పక్కదారి పట్టించి నామినేషన్ ఉపసంహరించుకోకుండా అడ్డుకున్నారని ఏలూరు జిల్లా చింతలపూడి మండలం నామవరం వైకాపా ఎంపీటీసీ అభ్యర్థి బానావతు మహేశ్ ఆవేదన వ్యక్తం చేశారు. తనను కారులో చాట్రాయికి తీసుకెళ్లి సమయం ముగిసేలా చేశారని, తెదేపా బెదిరింపులంటూ తాను మాట్లాడిన వీడియోపై ఆయన స్పష్టతనిచ్చారు.