ఆమనగల్లు మండల ప్రజావాణిలో నాలుగు వినతులు స్వీకరణ

రిపోర్టర్: Abdul Azeem స్థలం: ఆమనగల్

ఆమనగల్లు మండల కేంద్రంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో మొత్తం నాలుగు ఫిర్యాదులు అందినట్లు అధికారులు తెలిపారు. వచ్చిన అర్జీలలో మూడు రెవెన్యూ శాఖకు సంబంధించినవి కాగా, మరోటి మున్సిపల్ శాఖకు చెందిందని వెల్లడించారు. ప్రజల నుంచి స్వీకరించిన ఈ సమస్యలను సంబంధిత శాఖల అధికారులకు బదిలీ చేసి త్వరలోనే పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.