తెలంగాణ ఉద్యమకారుడు ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ సేవలు చిరస్మరణీయం

రిపోర్టర్: KOLA MAHESH స్థలం: నారాయణపురం

తెలంగాణ తొలి, మలి దశ ఉద్యమాల్లో కీలక పాత్ర పోషించిన స్వాతంత్ర్య సమరయోధుడు ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ త్యాగం చిరస్మరణీయమని ప్రభుత్వ విప్, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు. రామన్నపేటలో బాపూజీ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. తెలంగాణ ప్రజల హక్కులు, ఆత్మగౌరవం కోసం బాపూజీ జీవితాంతం పోరాడారని, మంత్రి పదవిని సైతం త్యాగం చేశారని ఎమ్మెల్యే కొనియాడారు.