హైదరాబాద్‌లో రూ.1656 కోట్లతో ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి టెండర్లు
రిపోర్టర్: సురేష్
స్థలం: హైదరాబాద్
హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఇబ్బందులను తొలగించేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. బంజారాహిల్స్ రోడ్డు నంబర్ 12 నుంచి గచ్చిబౌలి శిల్పా లేఅవుట్ వరకు రూ.1656 కోట్ల అంచనా వ్యయంతో 9 కిలోమీటర్ల పొడవున ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి హెచ్‌ఎండీఏ టెండర్లు ఆహ్వానించింది. సెప్టెంబర్ 22 వరకు ఆన్‌లైన్ బిడ్లు స్వీకరించనున్నారు. ఈ ప్రాజెక్ట్ అందుబాటులోకి వస్తే ఐటీ కారిడార్ ప్రయాణికులకు ట్రాఫిక్ తిప్పలు తప్పనున్నాయి.