ఉదయగిరిలో జనసేనాని పవన్ కళ్యాణ్ను కలిసిన చదలవాడ హరీష్, మృదుల

రిపోర్టర్: praveen kumar స్థలం: ఆత్మకూరు

పల్లె పండుగ కార్యక్రమంలో భాగంగా ఉదయగిరికి విచ్చేసిన ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ను జనసేన నాయకులు చదలవాడ హరీష్ కుమార్, చదలవాడ మృదుల మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్తో పలు అంశాలపై చర్చించారు. పవన్ పర్యటన జనసేన శ్రేణుల్లో నూతన ఉత్సాహాన్ని నింపిందని, పార్టీ కార్యక్రమాలను ప్రజల్లోకి మరింతగా తీసుకెళ్లాలని సూచించినట్లు నాయకులు తెలిపారు.