నెల్లూరులో దారుణం: భార్యపై కత్తితో భర్త కిరాతక దాడి
రిపోర్టర్: సురేష్
స్థలం: నెల్లూరు
నెల్లూరు జిల్లాలో వివాహం జరిగిన వారం రోజులకే భార్యపై భర్త హేమసాయి కత్తితో దాడి చేశాడు. ఆత్మకూరు వెళ్తుండగా మార్గమధ్యలో నిమ్మతోటలో ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. బాధితురాలు మహాలక్ష్మి గొంతు, చేతులపై తీవ్ర గాయాలయ్యాయి. పరిస్థితి విషమంగా ఉండటంతో ఆమెను మెరుగైన చికిత్స కోసం నెల్లూరుకు తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.