టీస్టా నదిలో కొట్టుకుపోయిన ఏనుగు పిల్లను కాపాడిన మత్స్యకారులు
రిపోర్టర్: శ్రీనివాస్
స్థలం: జల్పైగురి,వెస్ట్ బెంగాల్
వెస్ట్ బెంగాల్ జల్పైగురి జిల్లా మాల్బజార్ బ్లాక్ బైకంఠాపూర్ అటవీ ప్రాంతంలో టీస్టా నదిలో కొట్టుకుపోయిన ఏనుగు పిల్లను మత్స్యకారులు, అటవీ శాఖ అధికారులు రక్షించారు. శుక్రవారం నదిలో ప్రమాదవశాత్తు కొట్టుకుపోతున్న ఏనుగు పిల్లను స్థానిక మత్స్యకారులు అత్యంత సాహసంతో కాపాడి, సురక్షితంగా తల్లి ఏనుగు దగ్గరికి చేర్చారు.