గ్రామాభివృద్ధే తన లక్ష్యమంటూ పార్వతీపురం నియోజకవర్గంలో ఎమ్మెల్యే విజయ్చంద్ర విస్తృత ప్రచారం
రిపోర్టర్: సతీష్
స్థలం: బలిజిపేట
గ్రామాభివృద్ధే తన లక్ష్యమని పార్వతీపురం ఎమ్మెల్యే బోనెల విజయ్చంద్ర స్పష్టం చేశారు. బలిజిపేట మండలంలో నిర్వహించిన భారీ ర్యాలీలో ఆయన మాట్లాడారు. కూటమి అభ్యర్థులను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను కోరారు. సాగు, తాగునీరు, రహదారుల నిర్మాణానికి నిధులు మంజూరు చేశామని తెలిపారు. గొడ్డలి పార్టీ నాయకుల మాటలను నమ్మవద్దని ఆయన హితవు పలికారు.