అక్టోబర్ ఎనిమిది నుంచి అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్

రిపోర్టర్: హరి స్థలం: Hyderabad

అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ అక్టోబర్ ఎనిమిదివ తేదీ నుంచి అధికారికంగా ప్రారంభం కానుందని ఈకామర్స్ దిగ్గజం అమెజాన్ సంస్థ ప్రకటించింది. ఈ వార్షిక సేల్లో స్మార్ట్ఫోన్లు, లాప్టాప్లు, ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తులపై ఎనభై శాతం వరకు భారీ తగ్గింపు లభిస్తుందని కంపెనీ అధికారులు వెల్లడించారు. ఎంపిక చేసిన బ్యాంకు కార్డులు మరియు ఈఎంఐ లావాదేవీల ద్వారా కొనుగోలు చేసే వినియోగదారులకు పది శాతం తక్షణ తగ్గింపు లభిస్తుందని నిర్వాహకులు తెలిపారు.