అమెరికా వీసాదారులకు భారీ షాక్: నిబంధనల ఉల్లంఘనపై రెండు లక్షలకు పైగా రద్దు
రిపోర్టర్: సునీల్
స్థలం: అమెరికా
అమెరికాలో డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం ఇమ్మిగ్రేషన్ నిబంధనలను కఠినతరం చేస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నట్లు విదేశాంగ శాఖ ప్రతినిధి టామీ పిగాట్ తెలిపారు. నిబంధనలు అతిక్రమించిన వారిపై కొరడాఝుళిపించి ఏకంగా రెండున్నర లక్షలకు పైగా వీసాలను రద్దు చేసినట్లు వెల్లడించారు. బర్త్ టూరిజంను అణచివేయడంతో పాటు నిరంతరం విదేశీయుల ప్రవర్తనను పరిశీలిస్తున్నామని, తప్పుడు పత్రాలు సమర్పిస్తే కఠిన చర్యలు తప్పవని ట్రంప్ సర్కార్ హెచ్చరించింది.